రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడలో తెలంగాణ పల్లె ప్రగతి రెండో విడత ప్రత్యేక కార్యాచరణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
పల్లెప్రగతి రెండో విడత కార్యాచరణపై అవగాహన సదస్సు - mla manchireddy kishan reddy
తెలంగాణ పల్లె ప్రగతి రెండో విడత ప్రత్యేక కార్యాచరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
పల్లెప్రగతి రెండో విడత కార్యాచరణపై అవగాహన సదస్సు
గతంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా నియోజకవర్గానికి మొత్తం 13 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేసామని మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఈ పది రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
ఇవీ చూడండి: బతికున్నవరకు మచ్చతెచ్చే పనిచేయను: ఈటల