ప్రాణాలు తీసిన అతివేగం...
అతివేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులిద్దరూ పాత్రికేయులే : పోలీసులు
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపంలో బాహ్య వలయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చోసుకుంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొని అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులిద్దరిని ఉప్పల్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.