రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పడుతున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లగా.. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి వరద నీరు చేరడంతో అలుగు పారుతోంది. దీంతో సాగర్ రహదారిపై వరద నీరు చేరి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పూర్తిగా నిండి.. గత వారం రోజులుగా అలుగు పారుతోంది. రాత్రి కురిసిన వర్షానికి వరద ప్రభావం పెరగడంతో వరద నీరు శ్రీ ఇందు కళాశాల సమీపంలో సాగర్ రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు దగ్గరుండి వాహనదారులను దారి మళ్లిస్తున్నారు.
అలుగు పారుతున్న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు.. రాకపోకలకు అంతరాయం - Hyderabad latest news
నగరంలో గత రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండుకుండను తలపిస్తోంది. చెరువు అలుగు పారి వరదనీరు సాగర్ రహదారి పైకి చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
Ibrahimpatnam large pond