రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధి ఉస్మాన్ నగర్ ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కురిసిన వర్షానికి బుర్హాన్ పూర్ చెరువు నిండి ఇళ్లను చుట్టుముట్టింది. ఈ ప్రాంతంలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... ముంపు ప్రాంత ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.
12రోజులుగా జలదిగ్బంధంలోనే... ఉస్మాన్‌నగర్ వాసులు కష్టాలు - pond issue in jalpalli mandal rangareddy
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమారు 12 రోజుల నుంచి ఇళ్ల చుట్టు నీరు ఉంది. తమ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... నీటిని తోడివేసే ఏర్పాట్లు చేశారు.
12రోజులుగా జలదిగ్బంధంలోనే...
అప్పటి వరదకు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు తోడవడం వల్ల ఉస్మాన్‌నగర్ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఈ విషయమై స్థానికులు తమ గోడును మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. పరిసర గ్రామమైన వెంకటపూర్ గ్రామస్థులతో మాట్లాడి నీరు తరలించే ఏర్పాటు చేశారు.