తెలంగాణ

telangana

ETV Bharat / state

గో-ఆధారిత సేద్యం సకల ఐశ్వర్యాలకు మూలం

గో-ఆధారిత వ్యవసాయం ద్వారానే ఆరోగ్యానికి, పర్యావరణానికి లబ్ధి చేకూరుతుందని సచ్చిదానంద యోగ మిషన్​ వ్యవస్థాపకురాలు సాధ్వి నిర్మలానంద యోగ భారతి అభిప్రాయ పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గో-ఆధారిత సేద్యం సకల ఐశ్వర్యాలకు మూలం

By

Published : Aug 25, 2019, 12:02 AM IST

సమస్త ప్రాణకోటికి గో- ఆధారిత సేద్యమే అన్ని ఐశ్వర్యాలకు మూలమని సచ్చిదానంద యోగ మిషన్ వ్యవస్థాపకురాలు సాధ్వి నిర్మలానంద యోగ భారతి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మేకనిగడ్డలోని శ్రీవేణుగోపాల స్వామి మందిర గోశాల ప్రాంగణంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాచీన సంస్కృతి, యోగ, జీవన విధానం, ఉన్నత స్థితి పొందడం వంటి అంశాల గురించి వివరించారు. గో ఆధారిత వ్యవసాయంతో నాణ్యమైన ఆహారం లభిస్తుందని, ప్రకృతి రక్షించబడుతుందని ఆమె పేర్కొన్నారు. రసాయనిక ఎరువులతో పండించిన పంటల వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. సేంద్రీయ విధానం ద్వారానే వ్యవసాయం చేయాలని సూచించారు. జంట నగరాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గో-ఆధారిత సేద్యం సకల ఐశ్వర్యాలకు మూలం

ABOUT THE AUTHOR

...view details