రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. అక్కడే ఉన్న శివాలయంలో ఒక తాబేలు కనిపించింది. అది ప్రవేశించడానికి దారి లేకపోయినప్పటికీ... ఉదయం తలుపులు తీసేసరికి కనిపించింది. దాదాపు పది సెంటీమీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు ఆలయంలో దర్శనమివ్వడం చూస్తుంటే... కరోనా మహమ్మారి దేశాన్ని వదిలిపోతుందనడానికి శుభసూచకంగా దేవుడే ప్రత్యక్షమే ఉంటాడని ఆలయ అర్చకుడు సురేష్ ఆత్మారాం తెలిపారు.
చిలుకూరు బాలాజీ ఆలయంలో తాబేలు ప్రత్యక్షం - చిలుకూరు బాలాజీ ఆలయంలో... తాబేలు దర్శనం
చిలుకూరు బాలాజీ స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న శివాలయంలో ఈ రోజు ఒక తాబేలు దర్శనమిచ్చింది. దాదాపు 10 సెంటీ మీటర్ల పొడవు, 6 సెంటీ మీటర్ల పొడవుతో ఆ తాబేలు ఉందని ఆలయ అర్చకుడు తెలిపారు.
చిలుకూరు బాలాజీ ఆలయంలో... తాబేలు దర్శనం
భక్తులు చేసేటటువంటి ప్రార్థనలు, వైద్యులు చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుందని చెప్పడానికే స్వామి వారు కూర్మావతారంలో వచ్చాడని అన్నారు.
ఇవీ చూడండి:'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'