రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 24 గంటల వ్యవధిలో 341 మంది వైరస్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 210, మేడ్చల్-మల్కాజిగిరిలో 148 మందికి మహమ్మారి సోకింది. రాష్ట్రవ్యాప్త కేసుల్లో మూడోవంతు రాజధానిలోనే నమోదవుతున్నందున ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
కరోనా పంజా: గ్రేటర్లో ఒక్క రోజే 341 మందికి పాజిటివ్ - hyderabad corona update
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు నమోదవుతున్న కరోనా కేసుల్లో మూడో వంతు గ్రేటర్ పరిధిలోనే ఉంటున్నాయి. ఆదివారం.. భాగ్యనగరంలో 341 మందికి వైరస్ సోకింది. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్ పరిధిలో 699 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణయ్యింది.
కరోనా పంజా: గ్రేటర్లో ఒక్క రోజే 341 మందికి పాజిటివ్
వైరస్ సోకినవారిలో అధికశాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించకపోవడం వల్ల... వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేనివారు వ్యాప్తికి కారణమయ్యే ఆస్కారం ఉన్నందున బయట తిరిగేటప్పుడు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:కోలుకున్నా కొన్ని లక్షణాలుంటాయి: కేంద్రం