తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి డాబాపై నిద్రిస్తుండగా బండరాయితో మోది వ్యక్తి హత్య - బండరాయితో మోది వ్యక్తి హత్య

ఇంటి డాబాపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MURDER
ఇంటి డాబాపై నిద్రిస్తుండగా బండరాయితో మోది వ్యక్తి హత్య

By

Published : Apr 15, 2020, 5:21 PM IST

బిహార్ నుంచి వలస వచ్చిన సతీష్ అనే ఓ కార్మికుడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో మేస్త్రీగా కూలీ పనిచేసుకొని బతుకుతున్నాడు. ఇతను గత కొంతకాలంగా తన బంధువులైన హరిదాస్, యశోదలతో కలిసి ఉంటున్నాడు. నిన్న రాత్రి ఇంటిడాబాపై పడుకోగా.. ఈ రోజు తెల్లవారుజామున తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఇంట్లో ఉన్న హరిదాస్, యశోదలు పరారీలో ఉన్నందున వారే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details