రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం కంసంపల్లి గ్రామంలో కన్న తల్లినే హత్య చేశాడో దుర్మార్గుడు. నర్సింహులు తాగుడుకి బానిసయ్యాడు. పనీపాట లేకుండా ఊళ్లో పడి తిరుగుతుండేవాడు. ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగేందుకు డబ్బులివ్వమని తల్లిని వేధించాడు. డబ్బులు లేవని తల్లి చేప్పడంతో కోపోద్రిక్తుడైన నర్సింహులు... పక్కనే ఉన్న రోకలి బండ తీసుకొని తల్లిపై దాడి చేశాడు. చెవి, తలపై తీవ్రగాయాలై ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
తాగిన మత్తులో తల్లినే హతమార్చిన తనయుడు - డబ్బుల కోసం తల్లినే అత్యంత దారుణంగా హత్య చేశాడో రాక్షసుడు
తాగిన మత్తులో డబ్బుల కోసం తల్లినే అత్యంత దారుణంగా హత్య చేశాడో రాక్షసుడు. గతంలోనూ నిందితుడు భార్యపై దాడి చేసి జైలుకు వెళ్లాడు.
తాగిన మత్తులో తల్లినే హతమార్చిన తనయుడు
నిందితుడు గతంలోనూ భార్యపై దాడి చేసి జైలుకెళ్లాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'దిశ' హత్యాచారంపై రాజ్యసభలో విపక్షాల గళం