రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద భారీ మొత్తంలో బంగారాన్ని హైద్రాబాద్ ప్రత్యేక పోలీసు బృందాలు పట్టుకున్నాయి. ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దగ్గర పెద్దఎత్తు బంగారం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది.
షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద బస్సులో భారీగా బంగారం పట్టివేత - బస్సులో భారీగా బంగారం తరలింపు
ప్రైవేటు బస్సులో భారీ మొత్తంలో బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో... హైదరాబాద్ ప్రత్యేక పోలీసు బృందాలు వెంబడించి మరీ పట్టుకున్నాయి. బస్సును ఆపి తనిఖీ చేయగా... రూ. కోటీ 38 లక్షల పసిడి పట్టుబడ్డట్లు సమాచారం.
ONE CRORE WORTH GOLD SEIZED AT SHADNAGAR TOLL PLAZA
నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు బస్సును వెంబడించారు. షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద బస్సును ఆపి తనిఖీ చేయగా... నిందితుని నుంచి రూ. కోటి 38 లక్షల విలువైన పసిడి లభ్యమైనట్లు సమాచారం. నిందితున్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించి విచారిస్తున్నారు.