తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యం వికటించి పన్నెండేళ్ల బాలుడు మృతి - జ్యోతి క్లినిక్ సెంటర్​లో వైద్యం వికటించి పన్నెండేళ్ల బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లా యాచారంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వైద్యురాలి నిర్లక్ష్యంతో పన్నెండేళ్ల బాలుడు చనిపోయాడు. తమ ఒక్కాగానొక్క కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇందుకు కారణమైన వైద్యురాలిని శిక్షించాలని క్లినిక్​ ముందు ఆందోళన చేపట్టారు.

వైద్యం వికటించి పన్నెండేళ్ల బాలుడు మృతి

By

Published : Nov 8, 2019, 3:27 PM IST

వైద్యం వికటించి పన్నెండేళ్ల బాలుడు మృతి
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని జ్యోతి క్లినిక్ సెంటర్​లో వైద్యం వికటించి పన్నెండేళ్ల చరణ్ తేజ్ మృతి చెందాడు. మండల పరిధిలోని మల్కిజ్ గూడకు చెందిన వరికుప్పల ఈదయ్య, ఈదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు. గత రెండు రోజుల క్రితం బాలుడికి తీవ్ర జ్వరం రావడం వల్ల జ్యోతి క్లినిక్ కు తీసుకువచ్చారు. వైద్యురాలు జ్యోతి రెడ్డి చికిత్స చేసి పంపించింది.

మళ్లీ జ్వరం

అయినా మొదటిలాగే బాలుడికి జ్వరం రావడం వల్ల మళ్ళీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలు సెలైన్​ పెట్టి రెండు ఇంజక్షన్​లు ఇచ్చింది. కొద్ది సేపటి తర్వాత జ్వరం యథావిధిగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు. అక్కడికి వెళ్లే సరికే చరణ్​ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కుమారుడి మరణంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు జ్యోతి క్లినిక్ ముందు ధర్నా చేపట్టారు. వైద్యురాలు జ్యోతి రెడ్డి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని చరణ్​ శవంతో బంధువులు ఆందోళన చేశారు.

ఇవీ చూడండి: కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం

ABOUT THE AUTHOR

...view details