హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. జల్‌పల్లిలోని అటవీ ప్రాంతంలో చిరుత తిరుగుతున్నట్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. చిరుత కోసం గాలిస్తున్నారు.
మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో జనం - రంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత సంచారం వార్తలు
రంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలవరం సృష్టిస్తోంది. జల్‌పల్లిలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు
ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం కాటేదాన్ ప్రాంతంలో సంచరించిన చిరుత.. జల్‌పల్లిలో కనిపించిందని చెబుతోన్న చిరుత... రెండూ ఒకటేనా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో ఒంటరిగా బయట సంచరించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇదీచూడండి: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్
Last Updated : Jul 23, 2020, 8:23 AM IST