Attacked on ANM with Knife: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిపై కత్తితో దాడి జరిగింది. తెల్లవారుజామున విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం అనితపై (ఆమె అక్క భర్త) బావ కిషన్ నాయక్ దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా ఆమె మెడ, మోచేతిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
మరదలిపై అక్క భర్త కత్తితో దాడి.. దానికి నిరాకరించినందుకే.. - విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఎంపై కత్తితో దాడి
Attacked on ANM with Knife: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఎంపై ఆమె బావ కత్తితో దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే దాడికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె అరుపులు విన్న తోటి సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అనితను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పెళ్లికి నిరాకరించిందన్న కోపంతోనే దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంచాల గ్రామపంచాయతీ ఎల్లమ్మ తండాకు చెందిన అనిత షాద్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
ఇవీ చదవండి: