తెలంగాణ

telangana

ETV Bharat / state

వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు - రంగారెడ్డి జిల్లాలో వృద్ధురాలి హత్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

old women was killed at nedunuru in rangareddy district
వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

By

Published : Jan 28, 2020, 10:16 AM IST

వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో దారుణం చోటుచేసుకుంది. గ్రామశివారులో ఒంటరిగా నివసిస్తోన్న బాలమణి (80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాల్ని ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. బాలమణి ఇళ్లు ఊరికి చివర ఉండటం, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసిన వారే ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details