ఒకే పరిశ్రమలో 11 మంది బాలకార్మికులు పని చేస్తున్న ఘటన రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో జీబీబీఐ బిస్కెట్ పరిశ్రమలో వెలుగు చూసింది. మండలంలోని లాల్ పహడ్ పరిధిలో గల పరిశ్రమలో బాలకార్మికులు పని చేస్తున్నారన్న సమాచారంతో కార్మిక శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఒకే పరిశ్రమలో 11 మంది బాలకార్మికులు - బాలకార్మికులకు పని నుంచి విముక్తి
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో జీబీబీఐ బిస్కెట్ పరిశ్రమలో పని చేస్తున్న 11 మంది బాలకార్మికులను అధికారులు గుర్తించారు. కార్మిక శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఒకే పరిశ్రమలో 11 మంది బాలకార్మికులు
పరిశ్రమలో 13 మందిని బాలకార్మికులుగా గుర్తించి వారిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరిని ధ్రువ పత్రాల ద్వారా మెజర్లుగా గుర్తించి వదిలేశారు. మిగితా 11 మంది బాలలను స్టేట్ హోంకు తరలించారు. పరిశ్రమ యాజమన్యంపై కేసు నమోదు చేశారు.