రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో మోహన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, సేవలను గుర్తు చేశారు.
'ఎన్టీఆర్ సంక్షేమ పథకాల రూపంలో ఎప్పటికీ సజీవం' - మొయినాబాద్‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మొయినాబాద్‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సీవో తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎదిగి... విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడని కొనియాడారు.
ఇవీ చూడండి:పత్తికి అదనంగా రూ.275 పెంచండి!
TAGGED:
ntr jayanthi at moinabad