రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మూడో విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం చివరి రోజు కావడం వల్ల ప్రధాన పార్టీల నేతలు ఊరేగింపుతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని జడ్పీటీసీ స్థానాలకు 12 మంది, ఎంపీటీసీ స్థానాలకు 115 మంది తమ నామపత్రాలు సమర్పించారు.
శంషాబాద్లో ముగిసిన నామినేషన్ల పర్వం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు నామపత్రాలు దాఖలు చేయడానికి గడువు ముగిసింది. నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాలకు 12 మంది, ఎంపీటీసీ స్థానాలకు 115 మంది నామినేషన్లు వేశారు.
ముగిసిన నామినేషన్ల పర్వం
పోటీపడుతున్న అభ్యర్థులు తాము గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఒక్కసారి అవకాశమివ్వండి అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఇదీ చదవండిః రైతులపై కేసులు ఉపసంహరించుకుంటాం: పెప్సికో
Last Updated : May 3, 2019, 9:47 AM IST