తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలలతో పని వద్దు - MAHESH BAGAWATH

వలస కార్మికుల రక్షణ, బాలకార్మిక నిర్మూలన కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటుక బట్టీల వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

వలస కార్మికుల బాలబాలికలకు బ్యాగులు, పాఠ్య పుస్తకాలు అందజేత

By

Published : Feb 22, 2019, 6:15 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్​లో వలస కార్మికుల బాలబాలికల సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, రాచకొండ పోలీస్కమిషనర్ మహేష్ భగవత్ హాజరయ్యారు. హైదరాబాద్ శివార్లల్లో సుమారు 150 ఇటుక బట్టీలలో వేలాదిగా కార్మికులు పని చేస్తున్నారని, వారి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు. యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనిమహేష్ భగవత్ హెచ్చరించారు.వలస కార్మికుల బాలబాలికలకు బ్యాగులు, పాఠ్య పుస్తకాలను అధికారులు అందించారు.

యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : సీపీ

ABOUT THE AUTHOR

...view details