శవపరీక్షలపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ పూర్తయ్యిందని గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి కృపాల్ సింగ్ తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారమే శవపరీక్ష జరిగిందా లేదా అనే దానిపై విచారణ జరిపారని ఫోరెన్సిక్ అధికారి పేర్కొన్నారు. శవ పరీక్ష పూర్తి నివేదిక వచ్చేందుకు రెండ్రోజులు పడుతుందని కృపాల్ సింగ్ వెల్లడించారు. శవ పరీక్ష నివేదికను హైకోర్టు లేదా ఎన్‌హెచ్‌ఆర్సీకి సమర్పిస్తామని ఫోరెన్సిక్ అధికారి స్పష్టం చేశారు.
శవపరీక్షపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ పూర్తి : కృపాల్ సింగ్
దిశ ఘటన నిందితుల శవపరీక్షలపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ పూర్తయ్యిందని గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి కృపాల్ సింగ్ తెలిపారు.
శవ పరీక్ష పూర్తి నివేదిక వచ్చేందుకు 2 రోజులు పడుతుంది : కృపాల్ సింగ్