'ఎత్తిపోతల పనులు జరుగుతున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం' - Palamuru- Rangareddy project
19:51 February 09
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీ విచారణ..
NGT Inquiry on Palamuru-Rangareddy: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ జరిపింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం, కోస్గి వెంకటయ్య, చంద్రమౌళీశ్వర రెడ్డి బెంచ్‌కు తెలియజేశారు.
ప్రాజెక్టు పనులు ఆపినట్లు.. స్పెషల్ సీఎస్ లేదా చీఫ్ ఇంజినీర్ అండర్ టేకింగ్ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ నెల 14లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో తుది విచారణ చేపట్టనున్నట్లు ఎన్జీటీ వెల్లడించింది.
ఇదీ చూడండి: