రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో శనివారం 38 కరోనా కేసులు నమోదయ్యాయి. సాయిబాబానగర్‌కు చెందిన 63 ఏళ్ల వృద్ధుడు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చింతల్ పరిధిలో 10 కేసులు నమోదవగా, జీడీమెట్ల పరిధిలో ఏడుగురు వైరస్ బారినపడ్డారు. జగద్గిరిగుట్ట, గాజుల రామారం, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సంజయ్ గాంధీ నగర్, ప్రగతి నగర్, షాపూర్ నగర్ ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయి.