తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెంటనే మా కాలనీలకు తాగు నీటిని అందించాలి'

నిండు వేసవిలో హైదరాబాద్ నగర శివారు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మీర్​పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి తక్షణమే తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.

By

Published : May 3, 2019, 8:00 PM IST

వెంటనే నీరు అందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తాం

హైదరాబాద్ మీర్​పేట్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యపై పలు కాలనీల వాసులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. పదిహేను రోజులకు ఒక్కసారి కూడా నీటి సరఫరా సక్రమంగా చేయట్లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు కుండలు, మంచినీటి బిందెలతో నిరసన తెలిపారు. తమతో పన్నులు కట్టించుకుంటూ నీటి సరఫరా ఎందుకు చేయట్లేదని మున్సిపల్ కమిషనర్​ను నిలదీశారు. వెంటనే తమ కాలనీలకు నీటి సరఫరాను అందించాలని, లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మాతో పన్నులు కట్టించుకుంటూ నీరు ఎందుకు సరఫరా చేయట్లేదు : కాలనీ వాసులు

ABOUT THE AUTHOR

...view details