తెలంగాణ

telangana

ETV Bharat / state

'డెంటిస్ట్ కిడ్నాప్​ నిందితుడు నవీన్​రెడ్డికి టీ టైంకు సంబంధం లేదు' - టీ టైం ఎండీ అర్జున్​ గణేశ్​

Naveen Reddy has nothing to do with Teatime: నవీన్​రెడ్డికి టీ టైంకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను టీ టైం ఎండీ అర్జున్​ గణేశ్ ఖండించారు. ​అసలు టీ టైంకు ఆదిభట్ల నిందితుడికి సంబంధం లేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలతో తమ సంస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు.

Teatime MD Arjun Ganesh
టీ టైం ఎండీ అర్జున్​ గణేశ్​

By

Published : Dec 10, 2022, 4:29 PM IST

Naveen Reddy has nothing to do with Teatime: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో అమ్మాయి కిడ్నాప్​నకు సంబంధించి టీం టైం సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఆ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ అర్జున్​ గణేశ్​ తెలిపారు. కొన్ని మీడియా ఛానెల్​లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అసలు టీ టైంకు ఈ సంఘటనకు ఎటువంటి సంబంధంలేదని ప్రకటించారు. ఈ కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నవీన్​రెడ్డికి టీం టైంతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

3500 అవుట్​ లెట్లు కలిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థపై తప్పుడు కథనాలు రాయడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే బ్రాండ్​ విలువ.. నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. దయచేసి అందరూ ఇలాంటి అవాస్తవాలు ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

"నవీన్​రెడ్డికి టీ టైం సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. కొన్ని మీడియా ఛానెల్స్​లో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. 3500 షాపులు కలిగి ఎంతో మందికి ఉపాధి ఇస్తున్న సంస్థపై తప్పుడు ఆరోపణలు సరికాదు. దీనివల్ల సంస్థ బ్రాండ్​.. సంస్థపై ఉన్న నమ్మకం పోతాయి. నేనే టీ టైం ఎండీనీ.." -అర్జున్​ గణేశ్​, టీ టైం ఎండీ

నవీన్​రెడ్డికి టీ టైంకు సంబంధం లేదు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details