మహిళలు, యువతులు ఆరోగ్యంతో పాటు అందానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అందుకే... వారి అందాల్ని మరింత మెరుగులు దిద్దే కాస్మోటిక్స్ (Natural Cosmetics) ఉత్పత్తులకు దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు ఎన్నో దిగ్గజ సంస్ధలు పోటీ పడుతున్నాయి. అయితే... వీటిలో రసాయనాల వినియోగం పెరుగుతుండడంతో కొందరిలో దుష్ఫలితాలు వస్తున్నాయి. ఇది గమనించిన ఈ యువతి... రసాయనాలు లేని సౌందర్య సాధన ఉత్పత్తుల (Natural Hues By Mannu) తయారీ రంగంలోకి ప్రవేశించింది.
రంగారెడ్డి జిల్లా, మంచాలలోని ఆరుట్లకు చెందిన వనిపల్లి మనిస్వినీ రెడ్డి... ప్రస్తుతం ఎంఎస్సీ క్లీనికల్ న్యూట్రీషియన్ డైటేటిక్స్ చదువుతోంది. ఆ పరిజ్ఞానంతోనే రసాయన కాస్మోటిక్స్‌కు ప్రత్యమ్నాయ పద్ధతుల్ని అన్వేషించడం మొదలు పెట్టింది. తను చదువుకున్న విషయాలు, అనుభవజ్ఞులైన వారి దగ్గర తీసుకున్న సలహాలతో విస్తృత పరిశోధనలు ప్రారంభించింది.
డ్రాగన్ ఫ్రూట్తోనే ఉత్పత్తులు
2019 లాక్‌డౌన్ సమయంలో ప్రయోగాలు మొదలుపెట్టిన మనిస్వినీ... క్రమ క్రమంగా పురోగతి సాధించింది. తండ్రి శ్రీనివాస రెడ్డి స్వతహాగా డ్రాగన్ ఫ్రూట్ రైతు కావడం వల్ల ఆ పండునే తన ఉత్పత్తులకు (cosmetics with dragon fruits ) ముడి పదార్థంగా ఎంచుకుని ప్రయోగాలు చేసింది. శ్రీనివాస్ రెడ్డి స్టోరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి. తన ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఓ ల్యాబ్‌ను సైతం ఏర్పాటు చేసుకుంది. ఏఏ పదార్థాలను ఎంత మోతాదులో కలపాలో తెలియక.. ఎన్నో వైఫల్యాల్ని చవిచూసింది. తండ్రి ప్రోత్సాహము తోడవడంతో ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. అలా కొన్నాళ్లకు... డ్రాగన్ ఫ్రూట్‌తో కాస్మోటిక్స్ (Natural Hues By Mannu) తయారు చేసే పద్ధతిని కనిపెట్టింది. ఈ పండును వినియోగించి... సబ్బులు, ఫేస్ స్క్రబ్, బాడీ బట్టర్, బాత్ సాల్ట్, లిప్ స్క్రబ్, లిప్ బామ్, ఫ్రెష్ హైజెనిక్ వంటి ఉత్పత్తులు తయారు చేస్తోంది.
నాణ్యతలో రాజీ లేకుండా..
తన ఉత్పత్తులను.. నేచురల్ హ్యూస్ బై మన్ను (Natural Hues By Mannu) బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. కొవిడ్ కారణంగా.. ప్రజల్లోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో సామాజిక మాధ్యమాల ద్వారానే ఆన్‌లైన్ మార్కెటింగ్ చేస్తోంది. ఈ ఉత్పత్తుల తయారీ (Natural Hughes By Mannu)ని ఈ యువతే దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా.. ప్రతీ దశను శాస్త్రీయ పద్ధతుల్లోనే నిర్వహిస్తూ... ప్రజలకు సహజ సౌందర్య ఉత్పత్తుల్ని (Natural Hues By Mannu) అందించేందుకు కృషి చేస్తోంది.
రైతుల ఉత్పత్తులకు ఆదానపు ఆదాయం