తెలంగాణ

telangana

ETV Bharat / state

National Lok Adalat: "12న జాతీయ లోక్​ అదాలత్.. రాజీ కేసులకు​ మంచి వేదిక"

National Lok Adalat: జాతీయ లోక్​ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్​.తిరుపతి పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నెల 12 న జాతీయ లోక్​ అదాలత్​ జరగనుందని తెలిపారు.

National Lok Adalat
జాతీయ లోక్​ అదాలత్​

By

Published : Mar 6, 2022, 1:26 PM IST

National Lok Adalat: ఈ నెల 12 న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్​. తిరుపతి సూచించారు. ఈమేరకు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్​లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

సామరస్యంగా పరిష్కరించుకోదగ్గ కేసులను లోక్​అదాలత్​లో పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాదా కేసులు, రోడ్డు ప్రమాదం, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసులు సహా ఇతర కేసుల పరిష్కారానికి లోక్​ అదాలత్​ మంచి వేదిక అని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే రాజీ మార్గం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

"ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 9,574 కేసులను పరిష్కరించాం. చాలా మంది ఉత్సాహంగా లోక్​ అదాలత్​లో కేసుల పరిష్కారానికి వస్తున్నారు. కరోనా సంబంధిత కేసుల్లోనూ పెనాల్టీని తగ్గించాం. ఆన్​లైన్​లోనూ జరిమానాలు కట్టి.. కేసుల నుంచి విముక్తి పొందుతున్నారు. ఇలాగే కక్షిదారులు ముందుకొచ్చి రాజీ కుదుర్చుకోవాలని ఆశిస్తున్నాం. ఈ నెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి." -ఆర్​.తిరుపతి, రంగారెడ్డి జిల్లా జడ్జి

ఇదీ చదవండి:రక్తపోటు.. మధుమేహ కాటు.. ప్రమాదకరంగా జీవనశైలి వ్యాధులు

ABOUT THE AUTHOR

...view details