తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు - గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు.

National Handloom Day celebrations across the telangana state tomorrow
రేపు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

By

Published : Aug 6, 2020, 11:34 AM IST

రంగారెడ్డి జిల్లా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు. హయత్​నగర్ మండలంలోని కుంట్లూర్​ గాంధీ కుటీర్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధుల సమక్షంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. చేనేత దుస్తులను ప్రతిఒక్కరూ వాడినప్పుడే చేనేతకు మనం నిజమైన చేయూతనిచ్చినట్లు అవుతుందని వివరించారు.

ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ మన బాధ్యతగా చేనేత దుస్తులను ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు వాడితే చేనేత పరిశ్రమకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా చేనేతగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. విదేశీ వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని అన్నారు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

ఇదీ చూడండి :తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details