రాజ్యాంగం కల్పించిన హక్కులపై, లంబాడీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఎంపీ సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలని జాతీయ బంజారా మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్న ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంపీ సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలి: జాతీయ బంజారా మిషన్ - జాతీయ బంజారా మిషన్ నాయకుల సమావేశం
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలని జాతీయ బంజారా మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జాతీయ బంజారా మిషన్ నాయకుల సమావేశం
జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వ్యక్తి వివాదాలు సృష్టించడం మంచి పద్ధతి కాదని బంజారా మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజయ్య నాయక్ హితవు పలికారు. లంబాడీలకు, ఆదివాసీలకు మధ్య చిచ్చు పెట్టేలా ఎంపీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే భాజపా నాయకత్వం సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలని బంజారా జాతీయ మిషన్ నాయకులు కోరారు.