తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతిపై దాడి కేసు విచారణలో కీలక విషయాలు...

యువతిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితున్ని పోలీసులు విచారించారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం రిమాండ్​కి తరలించనున్నారు. విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు.

By

Published : Mar 3, 2021, 9:01 PM IST

narsingi knife attack case updates
narsingi knife attack case updates

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలో... ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసిన కేసులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు సల్మాన్​ను​ పోలీసులు విచారించారు. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హజరుపరిచి రిమాండ్​కి తరలించనున్నారు. ఘటనలో గాయపడిన బాధితురాలిని రేపు డిచ్ఛార్జ్​ చేసే అవకాశం ఉంది. హరియాణాకు చెందిన సల్మాన్... సెలూన్​లో పని చేసేవాడు. అదే సెలూన్​కి తరచూ వచ్చే బాధిత యువతితో సల్మాన్​కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది.

యువతి కుటుంబంతో కూడా సల్మాన్ కలివిడిగా మెలిగాడు. వారి ఇంట్లోని చిన్నచిన్న పనులు కూడా సల్మాన్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు ఉదయం కూడా బయటి నుంచి అల్పాహారాన్ని కూడా తీసుకెళ్లాడని తెలిపారు. ఘటన జరిగిన రోజున... ప్రేమ వ్యవహారంపై నిందితుడు సల్మాన్​కు బాధితురాలికి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణను కూడా పోలీసులు సేకరించారు. సల్మాన్​కు గతంలోనే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

ABOUT THE AUTHOR

...view details