Nanakramguda Woman Murder Case Updates : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో గత నెల 27న మహిళ దారుణ హత్యకు గురైన కేసులో ఓ నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 27వ తేదీన కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో గుర్తించిన పోలీసులు.. మృతురాలు గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. అంతకు రెండ్రోజుల ముందు నమోదైన అదృశ్య కేసు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. మృతురాలి వివరాలు గుర్తించారు. అలాగే హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా అదే ప్రాంతంలో కూలీ పనులు చేస్తున్న శ్యామల్‌రాయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. శ్యామల్‌రాయ్‌కు ఆమెతో అప్పటికే వివాహేతర బంధం కొనసాగుతుండగా.. 25వ తేదీన సాయంత్రం కలుసుకున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శ్యామల్ ఆమెను దారుణంగా హత మార్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
Gachibowli Woman Murder Case Updates : భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న శ్యామల్‌రాయ్.. పశ్చిమ బంగాల్ మాల్డా జిల్లా అడదంగాకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. కూలీలను సమకూర్చే గుత్తేదారు ఇచ్చిన సమాచారం, ఆధార్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు తన స్వస్థలానికి వెళ్లిపోయినట్లు గుర్తించారు. హత్య కేసు విచారణ కోసం ఏర్పడిన గచ్చిబౌలి పోలీసుల ప్రత్యేక బృందం శ్యామల్ కోసం బంగాల్‌కు వెళ్లింది. బంగ్లాదేశ్ సరిహద్దున నిందితుడి గ్రామం ఉండటంతో చాకచాక్యంగా.. అతికష్టం మీద శ్యామల్‌రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళను తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు.. ఈ విషయం అశోక్ సర్కార్, అలోక్ సర్కార్ అనే వ్యక్తులకు సైతం తెలుసునని పోలీసులకు వివరించాడు. ఈ మేరకు శ్రీకృష్ణాపూర్‌లో అశోక్ సర్కార్‌ను పట్టుకున్న పోలీసులు.. అలోక్ సర్కార్ కోసం బరింద గ్రామం బయల్దేరారు.
కార్పెంటర్ ఘాతుకం.. యువతి తల నరికి.. శరీరాన్ని ముక్కలు చేసి..