ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 52వ రోజూ కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో ఉన్న రెండు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. గత 5 రోజులుగా తాము ఉద్యోగాలు చేస్తామని వస్తే... తమను విధుల్లోకి అనుమతించడం లేదంటూ కార్మికులు ఆరోపించారు. అందుకు నిరసనగా డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బైఠాయించారు. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'విధుల్లోకి వస్తామన్నా... తీసుకోకపోవడం సరికాదు' - Must be taken to duty unconditionally
విధుల్లో చేరతామని వస్తే... డిపో మేనేజర్లు అనుమతించకపోవడం సరికాదని ఆర్టీసీ కార్మికులు వాపోయారు.
తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి