రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కమిషనర్ సురేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మున్సిపాలిటీలోని 22వ వార్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆయన పర్యటించారు.
'సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యం'
పురపాలికల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ సురేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
'సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యం'
కార్యక్రమంలో భాగంగా జేసీబీల సహాయంతో చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్త, పరిసరాల పరిశుభ్రతపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. పట్టణాల్లో సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.