రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నబీల్ కాలనీలో డ్రైనేజ్ నీరు, మురుగు రోడ్లపై ప్రవహిస్తుడడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జల్పల్లి మున్సిపాలిటీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, కమిషనర్‌కు మొరపెట్టుకున్న తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డికి కూడా విన్నవించుకున్నామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
నబీల్ కాలనీ వాసుల ఇక్కట్లు - రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నబీల్ కాలనీలో మురుగు రోడ్లపై ప్రవహిస్తుండడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నబీల్ కాలనీ వాసుల ఇక్కట్లు