తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస అభ్యర్థి ఇంటికెళ్లి ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి - తెరాస అభ్యర్థి ఇంటికెళ్లి ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి

మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి ఇంటికెళ్లి ఓట్లడిగింది ఓ స్వతంత్ర అభ్యర్థి. ఇప్పటికే ఎన్నో పదవులు అనుభవించారని... ఒక్కసారి అవకాశం ఇవ్వాలని స్వతంత్ర అభ్యర్థి గులాబీ పార్టీ నేతను వేడుకున్నారు.

muncipal elections compaign in rangareddy district
తెరాస అభ్యర్థి ఇంటికెళ్లి ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి

By

Published : Jan 18, 2020, 9:03 PM IST

శంషాబాద్ మున్సిపాలిటీలోని 18వ వార్డులో తెరాస అభ్యర్థి సుష్మ మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే వార్డులో స్వతంత్ర అభ్యర్థి వేదంతి బరిలో ఉన్నారు. బంతి గుర్తుకే ఓటు వేయాలంటూ తెరాస అభ్యర్థి ఇంటికెళ్లి అభ్యర్థించారు.

ఇప్పటికే ఎన్నో పదవులు అనుభవిస్తున్నారని... ఒక్కసారి బంతి గుర్తుకు ఓటేసి తమకు అవకాశం ఇవ్వాలని గులాబీ పార్టీ అభ్యర్థిని వేదంతి వేడుకున్నారు.

తెరాస అభ్యర్థి ఇంటికెళ్లి ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి

ఇవీ చూడండి: భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details