రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌లోని వార్డుల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. 60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. గంధంగూడ, పీరం చెరువు, బైరాగిగూడ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. యాత్ర అనంతరం రోడ్‌షోలో పాల్గొన్నారు.
బండ్లగూడ కార్పొరేషన్లో ఎమ్మెల్యే పాదయాత్ర - మున్సిపల్ ఎన్నికలు
పుర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు.
బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో ఎమ్మెల్యే పాదయాత్ర
పుర ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'