తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు... హత్యకు దారి తీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరగడానికి కొద్దిసేపటి వరకూ అతను ఎవరితో మాట్లాడాడు అనే దానిపై సాంకేతిక ఆధారాలు పరిశీస్తున్నారు. ఇప్పటికే రాచకొండ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు. హత్య సురేశ్ ఒక్కడే చేశాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు..ఘటనకు కారణంగా భావిస్తున్న భూ వివాదానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. సురేశ్ తండ్రి కృష్ణయ్య, పెదనాన్నలు దుర్గయ్య, భిక్షపతి, సోదరుడు ఆనంద్‌తో పాటు మరి కొంత మంది సన్నిహితులను విచారించిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. హత్యకు మరి కొందరి ప్రోద్బలం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
విజయారెడ్డి హత్యకేసులో ఇంకెవరైనా ఉన్నారా? - విజయారెడ్డి హత్యకేసు
సంచలనం సృష్టించిన తహసీల్దార్ విజయరెడ్డి సజీవదహనం కేసులో రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి బంధువులను విచారించారు. కేవలం సురేశ్ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా... అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు కేసు విచారణను మరింత వేగవంతం చేశారు.
విజయారెడ్డి హత్యకేసులో ఇంకెవరైనా ఉన్నారా?