రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో గాయపడిన గుమస్తా చంద్రయ్యను అపోలో డీఆర్డీవో ఆస్పత్రి నుంచి ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన నుంచి చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు - abdullapur met mro muder case latest news
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో తీవ్రగాయాలైన గుమస్తా చంద్రయ్యను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా ఇప్పటికి హామీ నెరవేరలేదని వాపోయారు.
ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు
అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదన్నారు. వైద్య ఖర్చులు భరించాలని, లేకుంటే ప్రభుత్వం నుంచి హామీ పత్రం తీసుకురావాలని అపోలో డీఆర్డీవో వైద్యులు స్పష్టం చేశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకరించకపోతే అబ్దుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరే దిక్కు లేదని వాపోయారు.
Last Updated : Nov 12, 2019, 9:16 PM IST