విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజకీయం రసకందాయంలో పడిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు జతచేసి చేసిన ట్వీట్‌లో.. హంపిలో ధూమ్ ధామ్, కోవర్ట్ క్రాంతి కిరణాలతో కకావికలం అంటూ తెరాస అంతర్గత రాజకీయాలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు - mp Revanth Reddy latest news
మంత్రి జగదీశ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఎంపీ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల మాదిరిగానే జగదీశ్రెడ్డికీ తెరాస నుంచి ఉద్వాసన తప్పడంటూ ట్వీట్ చేశారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జగదీశ్‌రెడ్డి తెరాస రాజకీయానికి యముడు గంట కట్టినట్టేనా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈటల వ్యవహారం తర్వాత జగదీశ్‌రెడ్డి వ్యవహారం బయటకు పొక్కడంతో.. ఇక ఆయన పని కూడా అయిపోయినట్టేనన్న అర్థం వచ్చేట్లు తెరాస అంతర్గత రాజకీయాలపై రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా విమర్శలు చేశారు.
ఇదీ చూడండి: 'మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలి'
Last Updated : Jun 9, 2021, 12:48 PM IST