"నువ్వు బాగా చదివి మన జిల్లాకు కలెక్టరమ్మవు కావాలి" అంటూ చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి... భార్గవి అనే విద్యార్థినిని ఆశీర్వదించారు. "నువ్వు చదువు సంగతి చూడు... అందుకయ్యే ఖర్చుల సంగతి నాకు వదిలేయ్..."అంటూ ఉన్నత విద్యపై విద్యార్థికి భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన సీహెచ్ రవీందర్, సువర్ణ దంపతుల కూతురు భార్గవి... భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో అగ్రో ఫారెస్ట్రీ విభాగంలో 14వ ర్యాంక్ సాధించింది.
'బాగా చదివి కలెక్టరమ్మవు కావాలి... మన జిల్లాకే రావాలి' - mp phone call to icar ranker
"నువ్వు మన జిల్లాకే గర్వకారణం. బాగా చదువు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకో. సివిల్స్‌కు సిద్ధమవ్వు. నువ్వు కలెక్టరమ్మవు కావాలి. మన జిల్లాకే వచ్చి సేవ చేయాలి. చదువు సంగతి నువ్వు చూసుకో... అందుకయ్యే ఖర్చుల సంగతి నేను చూసుకుంటా.." అంటూ ఓ పేద ప్రతిభావంతురాలైన విద్యార్థికి ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రోత్సాహమిచ్చారు.
రోజూ దుస్తులు ఇస్త్రీ చేసి జీవనం గడుపుతున్న పేద కుటుంబానికి చెందిన భార్గవి విషయం తెలుసుకున్న ఎంపీ... స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. విద్యార్థి లక్ష్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యనభ్యసించి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తన లాంటి విద్యార్థులు సివిల్స్ కోసం సిద్ధమై కలెక్టర్ కావాలంటూ సూచించారు. ఫోన్‌లో అల్ ది బెస్ట్ చెప్పారు.
ఉన్నత విద్యలో ఎంతగా చదుకోవాలన్నా తనకు అన్ని విధాలా సహాయ, సహకారాలు తప్పకుండా అందిస్తానని ఎంపీ రంజిత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉన్నత లక్ష్యం పెట్టుకుని... దాన్ని ఛేదించాలంటూ... విద్యార్థి భార్గవి వెన్నుతట్టి ప్రోత్సహించారు.
ఇదీ చూడండి: ఆదుకోకుంటే ఆత్మహత్యలే: బాణాసంచా వ్యాపారులు
TAGGED:
mp phone call to icar ranker