తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం' - mp ranjith reddy meet ktr at pragathi bhavan

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం ఏడాది కాలంగా విశేషంగా కృషి చేస్తున్నానని ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూపొందించిన భవిష్యత్తు ప్రగతి ప్రణాళికలను మంత్రి కేటీఆర్​కు సమర్పించారు.

mp ranjith reddy meet minister ktr at pragathi bhavan hyderabad
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం

By

Published : Jun 9, 2020, 3:36 PM IST

అభివృద్ధి-అందుబాటు అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తనను గెలిపించిన ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులోకి ఉంటానని భరోసా ఇచ్చారు చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి. ప్రగతి భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది కాలంలో తాను పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు తదితర అంశాలను కేటీఆర్‌కు వివరించారు.

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న దృష్ట్యా... కేటీఆర్‌కు భవిష్యత్తు ప్రగతి ప్రణాళికపై రూపొందించిన నివేదిక సమర్పించారు. ఎంపీ విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.

ఇదీ చూడండి:చనిపోయిన వారికి కరోనా పరీక్షలు అశాస్త్రీయం: ఈటల

ABOUT THE AUTHOR

...view details