ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సోమవారం చేవెళ్లలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రంజిత్‌రెడ్డి ఎన్నికలపై అవగాహన కల్పించారు. అక్టోబర్ 1 నుంచి ప్రతి పట్టభద్రులు.. ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఎన్నికలు ఏదైనా గులాబీ జెండా ఎగరడం ఖాయమని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఎంపీ రంజిత్ ధీమా - graduate mlc election news
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రజాప్రతినిధులు, యువకులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఎంపీ రంజిత్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఎంపీ రంజిత్ ధీమా
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యతను గ్రాడ్యుయేట్స్‌కు వివరించాలన్నారు. రంగారెడ్డి వివిధ పరిశ్రమలకు హబ్‌గా మారనున్న నేపథ్యంలో జిల్లాలోని స్థానిక యువతకే ఉద్యోగ- ఉపాధి అవకాశాలు వస్తాయనే అంశాన్ని డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి చేరవేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు రంజిత్‌రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి:వరుస ఎన్నికలపై కారు నజర్.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ
TAGGED:
mp ranjith reddy latest news