తెలంగాణ

telangana

ETV Bharat / state

MP Ranjith Reddy: చిన్నారికి అండగా నిలిచిన ఎంపీ రంజిత్ రెడ్డి - చిన్నారికి అండగా నిలిచిన ఎంపీ రంజిత్ రెడ్డి

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి(MP Ranjith Reddy) ఓ చిన్నారికి అండగా నిలిచారు. బ్లాక్​ ఫంగస్​, క్యాన్సర్​తో తల్లడిల్లుతున్న ఓ చిన్నారికి సీఎం కేసీఆర్(KCR) ఆఫీస్ సహకారంతో రూ.10 ల‌క్షల LOC తీసుకువ‌చ్చేందుకు కృషి చేశారు.

mp ranjith reddy help to child
mp ranjith reddy help to child

By

Published : Jun 4, 2021, 8:48 AM IST

ప‌సి హృద‌యాన్ని బ‌తికించేందుకు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి(MP Ranjith Reddy) విశ్వ ప్రయ‌త్నాలు చేయడమే కాకుండా చేయూత‌ను అందించారు. ఈ మేర‌కు సీఎం కేసీఆర్(KCR) ఆఫీస్ సహకారంతో LOC(లెట‌ర్ ఆఫ్ క్రెడిట్‌)ను పేషెంట్ అత్విక్ తండ్రి రిషికేశ్వర్‌రావుకు ఎంపీ గురువారం అంద‌జేశారు. రాజేంద్రన‌గ‌ర్ ప‌రిధిలోని గండిపేట్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి అత్విక్‌ గ‌త కొద్దిరోజుల కిందట క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. అనంతరం బ్లాక్ ఫంగ‌స్(Black fungus) సోకిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు. ఇందుకోసం ఆ కుటుంబీకులు ప‌లు ప్రైవేటు ఆసుత్రులు తిరిగి పెద్ద ఎత్తున డ‌బ్బులు ఖ‌ర్చు చేసుకున్నారు.

బ్లాక్ ఫంగ‌స్ ట్రీట్‌మెంట్ అందిస్తున్న క్రమంలోనే అత‌నికి క్యాన్సర్ ఉంద‌ని తేల‌డంతో అత్విక్ కుటుంబీకులు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని ఆశ్రయించారు. త‌మ కుమారుడి ట్రీట్‌మెంట్‌కు ప్రభుత్వం త‌ర‌ఫున సాయం చేయాల‌ని కోరారు. విష‌యం తెలియగానే చ‌లించిపోయిన ఎంపీ రంజిత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ కార్యాల‌యం దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారుల‌తో మాట్లాడి వెంట‌నే రూ.10 ల‌క్షల LOC తీసుకువ‌చ్చేందుకు కృషి చేశారు.

సీఎంఓ నుంచి వ‌చ్చిన ఎల్ఓసీని ఆయన అత్విక్ తండ్రి రిషికేశ్వర్ రావుకి అంద‌జేశారు. దాంతో పాటు ప్రస్తుతం అత్విక్ చికిత్స పొందుతున్న కాంటినెంట‌ల్ ఆసుప‌త్రి వైద్యుల‌తో మాట్లాడిన ఎంపీ రంజిత్ రెడ్డి, చిన్నారికి మెరుగైన వైద్యం అంద‌జేయాల‌ని సూచించారు. ట్రీట్​మెంట్ వివ‌రాలు త‌న‌కు తెలుపుతూ ఉండాల‌ని ఆసుప‌త్రి ఎండీతో చెప్పారు. త‌మ కుమారుడి వైద్యానికి ఎంపీ తీసుకున్న ప్రత్యేక చొర‌వ‌కు రిషికేశ్వరరావు ప్రత్యేకంగా కృత‌జ‌్ఞత‌లు తెలుపుతూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

ఇదీచూడండి: BLACK MARKET: బ్లాక్​ఫంగస్​ డ్రగ్​ను అమ్ముకున్న ప్రభుత్వ వైద్యుడు

ABOUT THE AUTHOR

...view details