కన్నతల్లే కొడుకును చంపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పల్లెతండాకు చెందిన యువకుడు హరిలాల్ ఏ పనిచేయకుండా తిరుగుతున్నాడు. ఏదైనా పని చూసుకో అని చెప్పిన తల్లి విసిగిపోయింది.
ఓ రోజు అర్థరాత్రి కొడుకు వేధింపులు తాళలేక ఇంట్లోనే గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది. అనంతరం తండా శివారులోని ముళ్లపొదల మధ్య పడేసింది. మతిస్థిమితం లేక ఎక్కడికో వెళ్లి చనిపోయాడని తండావాసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోస్టుమార్టంలో హత్యగా తేలండంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో కుమారుడిని చంపినట్లు నిందితురాలు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలికి ఎవరైనా సహకరించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
'మటన్ పెట్టమని తల్లిని వేధించాడు.. ఆమె కొడుకును చంపేసింది' - mother killed his son at rangareddy district
మటన్ తెచ్చి వండి పెట్టు అని ఓ తల్లిని వేధించాడో కొడుకు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. కూలి చేసుకుని బతికే ఆ తల్లికి రోజూ మటన్ తెచ్చి పెట్టమంటే ఎలా సాధ్యం. జులాయిగా తిరిగే కొడుకు అర్థరాత్రి ఫూటుగా మద్యం తాగి విసిగిస్తే కోపం వచ్చింది. అదుపు చేసుకోవటం ఆ తల్లికి సాధ్యం కాలేదు. ఎంతగా అంటే కొడుకును చంపేంత.
'మటన్ పెట్టమని తల్లిని వేధించాడు.. ఆమె కొడుకును చంపేసింది'
ఇవీ చూడండి: 1500 మంది పర్యటకులను కాపాడిన భారత సైన్యం