ఇంట్లో బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి గురై తల్లి, కూతురు మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్‌నగర్‌లో చోటు చేసుకుంది. సల్మా బేగం తన ఇంట్లో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు వైరులో విద్యుత్ ప్రవహించి సల్మా బేగంతో పాటు కూతురు సానియా అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరు చిన్నారులు సంరీన్, ముస్కాన్‌లను స్థానికులు రక్షించి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి...ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
'విద్యుదాఘాతంతో తల్లీ కూతుళ్లు మృతి' - balapur police
ఉతికిన బట్టలు తీగపై ఆరేస్తుండగా..ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్ ప్రవహించి తల్లి, కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. బాధిత కుటుంబాలను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి... ప్రభుత్వం తరపున అన్ని రకాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం
ఇవీ చూడండి : కల్వర్టును ఢీకొట్టిన బస్సు..ఐదుగురి పరిస్థితి విషమం