ప్రశ్నించే గొంతుకకు మద్దతిస్తే పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో పోరాటం చేయవచ్చని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గౌరీ సతీష్ అన్నారు. శంషాబాద్‌లోని విజ్ఞాన్ పీజీ కళాశాల సమీపంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వివిధ కళాశాలల అధ్యాపకులతో సతీష్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పట్టభద్రుల సమస్యలపై పోరాడతా: స్వతంత్ర అభ్యర్థి సతీష్ - స్వతంత్ర అభ్యర్థి గౌరీ సతీష్
పట్టభద్రుల సమస్యలపై శాసన మండలిలో పోరాడటానికి తనకు అవకాశం కల్పించాలని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్ అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంషాబాద్‌లో అధ్యాపకులతో సమావేశమయ్యారు.
స్వతంత్ర అభ్యర్థి సతీష్
రాష్ట్రంలో పట్టభద్రులకు న్యాయం చేస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరేళ్లయినా సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని సతీష్ విమర్శించారు. కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తెరాస పాలనలో విద్యారంగం నిర్వీర్యం అయిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.