గాజులరామారం పరిధిలోని పెద్దమ్మనగర్లోని సర్వే నెంబర్ 79లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు విద్యుత్ మీటర్లు తీసుకెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో నివాసం ఉండే సుమారు 200 మంది కుటుంబాలు తమ ఇళ్లను వీఆర్వో కూల్చేశారంటూ చింతల్‌లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కార్యాలయానికి వచ్చారు. న్యాయం చేయాలని కోరారు.
వైరల్‌గా మారిన ఎమ్మెల్యే ఫోన్ సంభాషణ
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వీఆర్వోతో మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. విద్యుత్ మీటర్లు ఎందుకు తీసుకెళ్లారంటూ వీఆర్వో శ్యామ్‌పై తిట్లతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే.
శనివారం తెల్లవారుజామున 12 ఇళ్లను కూల్చి వారి ఇంటి కరెంటు మీటర్లు తీసుకెళ్లినట్లు బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వివేకానంద వీఆర్వో శ్యామ్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్లతో విరుచుకుపడ్డారు. వీఆర్వోతో ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీఆర్వో శ్యామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని.. మహిళలు తమ గోడును తెలిపిన విధానంతో చలించి వివేకానంద ఆగ్రహించారని ఎమ్మెల్యే కార్యాలయం వివరణ ఇచ్చింది.
ఇదీ చదవండి:శ్రీశైలం ఘంటామఠంలో బయటపడ్డ బంగారు నాణేలు