తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్​పల్లి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన యాకుత్​పుర ఎమ్మెల్యే - రంగారెడ్డి జిల్లా జల్​పల్లిలోని వరద ముంపు ప్రాంతాలు

రంగారెడ్డి జిల్లాలోని ముంపునకు గురైన ఉస్మాన్​ సాగర్​, అమ్రీన్ కాలనీల్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్​తో కలిసి యాకుత్​పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ పర్యటించారు. గత కొద్దిరోజులుగా కురిన వర్షానికి జల్​పల్లి మున్సిపాలిటి పరిధిలోని పలు కాలనీ నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

mla Syed ahmad pasha visit Flood prone areas at jalpally in rangareddy district
జల్​పల్లి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన యాకుత్​పుర ఎమ్మెల్యే

By

Published : Sep 29, 2020, 6:38 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటి పరిధిలోని ఉస్మాన్ సాగర్ కాలనీలో ముంపునకు గురైన ప్రాంతాల్ని ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్​తో కలిసి పరిశీలించారు. వరద నీటి సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను మున్సిపల్​ కమిషనర్, ఇంజినీర్లు, ఆర్డీఓలతో చర్చించారు. నీట మునిగిన ఇళ్లల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇరిగేషన్ ఇంజినీర్లతో పూర్తిస్థాయి నివేదిక తయారుచేసి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ముందడువేస్తామని అదనపు కలెక్టర్​ ప్రతిక్​ తెలిపారు.
ఉస్మాన్ సాగర్ కాలనీలో వర్షపు నీరు పోవడానికి ఎక్కడ కూడా అవకాశంలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సయ్యద్​పాషా ఖాద్రీ అభిప్రాయపడ్డారు. వీలైనంత తొందరగా నీటిని తొలగించే ఏర్పాట్లు చేయనునట్లు హమీ ఇచ్చారు. ఈపర్యటనలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, ఎమ్​ఐఎమ్​ నేత అహ్మద్ సాది తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details