రంగారెడ్డి జిల్లా కొహెడలో ప్రారంభించనున్న పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌తో కలసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. లాక్‌డౌన్, త్వరలో ప్రారంభం కాబోతున్న మామిడి సీజన్‌లో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా మార్కెట్‌ను కొహెడకు తరలిస్తున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో దేశ వ్యాప్తంగా రోజుకు 400 నుంచి 600 వరకు లారీలు మార్కెట్‌కు రావడం, పెద్దఎత్తున రైతులు, ప్రజలు ఒకే చోట ఉండే అవకాశం ఉంది. రద్దీని తగ్గించాలని మార్కెట్‌ను అంచెలు అంచెలుగా తరలిస్తున్నామని... రానున్న రెండు సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో మార్చుతామని తెలిపారు.
కొహెడ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న పండ్ల మార్కెట్ పనులను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్‌తో కలిసి పరిశీలించారు.
కొహెడ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
సుమారు 180 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో కొహెడ మార్కెటను తీర్చదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. మార్కెట్‌లోకి ప్రవేశించే రహదారికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని మున్సిపల్ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.