ప్రజల సమస్యలు నెరవేర్చడమే తన ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని మైలార్ దేవ్పల్లి దుర్గా నగర్ కాలనీలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
'అవసరమైతే నిధుల కోసం సీఎంతో మాట్లాడతా...' - రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధి మైలార్ దేవ్ పల్లిలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పర్యటించారు. కాలనీలను సందర్శిస్తూ మురుగు నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని కాలనీల్లో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పర్యటన
అవసరమైతే నిధుల కోసం సీఎం కేసీఆర్తో మాట్లాడి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దుర్గా నగర్లో ప్రధానంగా తిష్ఠవేసిన మురుగు నీటి సమస్యను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : నిర్లక్ష్యం చేస్తే హైదరాబాద్ కాలుష్యకాసారమవుతుంది: సీఎం
TAGGED:
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే