తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - Ibrahimpatnam Mission Bhagiratha Works

MLA Manchireddy laid the foundation stone for development programs: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ. 3.40కోట్ల వ్యయంతో 25లక్షల లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్​లకు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో నూతన మంచినీటి ట్యాంకుల ద్వారా మంచినీటిని మున్సిపాలిటీ ప్రజలకు అందించాలని అధికారులకు ఆదేశించారు.

MLA Manchireddy laid the foundation stone for development programs.
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

By

Published : Dec 28, 2022, 12:39 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కాశంగుట్టలో రూ.3.40 కోట్ల వ్యయంతో 25 లక్షల లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లకు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్​రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజ్​రంజిత్ ప్రైమ్ హోమ్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్​లకు కొబ్బరికాయ కొట్టి ఆయా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. అందులో భాగంగానే తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 6 నెలల్లో నూతన మంచినీటి ట్యాంకుల ద్వారా మున్సిపాలిటీ ప్రజలకు నీటిని అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ వొంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపాలిటీ ఛైర్మన్ మల్రెడ్డి అనురాధ, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details