రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ అరుంధతినగర్లో వరద బాధిత కుటుంబాలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.
వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే - రంగారెడ్డి జిల్లా వార్తలు
భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ అరుంధతినగర్లో వరద బాధితులకు పది వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు.
వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
వర్షాలకు నష్టపోయిన ప్రతి కుటుంబానికి డబ్బులు అందజేస్తామన్నారు. అధికారులు ఇంటింటికి తిరిగి బాధితుల వివరాలను నమోదు చేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ మల్రెడ్డి అనురాధ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన